తూనీగ..తూనీగ..’ అంటూ ప్రేమకథతో కుర్రకారు గుండెల్నిపిండి చేసిన చిత్రం మనసంతా నువ్వే. ప్రేమకథల్లో నూతన ఒరవడిని సృష్టించి, ట్రెండ్సెట్టర్లా నిలిచిన మనసంతా నువ్వే చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001 అక్టోబర్ 19న విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కేవలం కోటి 30 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన మనసంతా నువ్వే.. 16 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాత ఎం.ఎస్.రాజు కు లాభాల పంట పండించింది.
సినిమా కథ అరకు లోయలో మొదలవుతుంది. అను సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. చంటిది నిరుపేద కుటుంబం. వీరిద్దరూ బాల్యంలో మంచి స్నేహితులవుతారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఆ తర్వాత విడిపోయిన వీరిద్దరు పెద్దయ్యాక ఊహించని పరిణామాల మధ్య కలుస్తారు. ‘నువ్వునేను’ వర్షాకాలంలో వచ్చి తెలుగు యువతను వలపు వానలో ముంచేసింది. ఇది విడుదలైన రెండు నెలలకి ‘మనసంతా నువ్వే’ దసరాకి వచ్చి ట్రెండ్ సృష్టించింది. ఈ విజయంతో ఉదయ్‌కిరణ్ స్టార్‌గా మారిపోయాడు.
మనసంతా నువ్వే చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో చిత్ర బృందం సెలబ్రేషన్స్ జరుపుకుంది. చిత్ర దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు కొందరు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
20 Glorious years celebrations of Classic Blockbuster #ManasanthaNuvve.
— BA Raju's Team (@baraju_SuperHit) October 20, 2021
Director @vn_aditya & Music director @rppatnaik,@vivekkuchibotla and others attended the event.#UdayKiran #ReemaSen @GkParuchuri @VeeruPotla1 @MSRajuOfficial @MayankOfficl#20YearsforManasanthaNuvve pic.twitter.com/KdETV669Am