బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కంటెస్టెంట్ మానస్. సీరియల్స్ తో ప్రేక్షకులకు చేరువైన ఈ నటుడు.. ఇప్పుడు రియాలిటీ షోతో మరింత దగ్గర అవుతున్నాడు. షో మొదలైన ఈ 70 రోజుల్లో చాలా కూల్ అండ్ కామ్ గా.. ఎంతో మెచ్యూర్డ్ గా ఉన్నాడు మానస్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నోరు జారకుండా కంట్రోల్లో ఉంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈయన. కచ్చితంగా ఈ సీజన్ ఫైనలిస్టుల్లో మానస కూడా ఉంటాడని సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది. ఇన్ని రోజుల్లో ఎన్నో టాస్క్ ల్లో పాల్గొన్నాడు మానస్. అయితే ఇప్పటి వరకు మనోడిని సూపర్ ఎగ్జయిట్ అవుతూ ఒక్కసారి కూడా చూడలేదు. గెలిచినా ఓడినా మొహంలో కూల్ నెస్ మాత్రం అలాగే ఉంటుంది.
అలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు చిన్నపిల్లాడిగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయాడు. తాజాగా జరిగిన టాస్క్ లో మానస్ కుప్పిగంతులు వేసిన తీరు చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా.. చిన్న పిల్లాడిలా ఆ గెంతులు ఏంటి అంటూ నెటిజన్లు సరదాగా ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. సండే ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున ఇచ్చిన ఒక టాస్క్ లో హీరో హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు చూపిస్తే వాటిని గుర్తుపట్టాలి.. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఫోటో వచ్చినప్పుడు ఎవరు గుర్తు పట్టలేకపోయారు. ఆ టాస్కుకు మానస్ సంచాలకుడిగా ఉన్నాడు. పవన్ చిన్నప్పటి ఫోటో చూడగానే వెనకనుంచి కుప్పి గంతులు వేయడం మొదలుపెట్టాడు. చెప్పండి.. చెప్పండి అంటూ గట్టి గట్టిగా అరిచాడు. నాగార్జున టైం అప్ అనగానే సార్ ఈసారి సంచాలకుడిగా అవకాశం ఇవ్వమని అడిగాడు.
నాగార్జున పర్మిషన్ గ్రాంటెడ్ అనగానే వెంటనే పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు పవన్ పాటకు సోలో డాన్స్ చేసి అదరగొట్టాడు ఈ కుర్రాడు. ప్రస్తుతం మానస్ చేసిన ఈ పవర్ ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏదేమైనా నిన్న మొన్నటి వరకు చాలా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నట్టు కనిపించిన మానస్ మనసు.. పవన్ కళ్యాణ్ బొమ్మ చూడగానే అదుపు తప్పింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg Boss 5 Nominations | ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వాళ్ళే..బిగ్ బాస్ మళ్లీ ట్విస్ట్ ఇవ్వడుగా..!
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి