కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో తాళం ఇంటి సభ్యులు పరుగులు పెట్టడం, తోసుకోవడం చూస్తుంటే ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ వారు కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుంటారో అని చాలా టెన్షన్ పడుతున్నారు. తాళం కోసం అందరూ పరిగెడుతున్న సమయంలో విశ్వ, మానస్ మధ్య గొడవలు జరిగాయి. సిరి, ప్రియాంకలు ఒకరినొకరు తన్నుకున్నంత పని చేశారు.
అనంతరం సిరిపై షణ్ముఖ్ పదే పదే అరుస్తుండడంతో అందరి ముందు ఎందుకు అలా అంటున్నావ్ అని జెస్సీ ప్రశ్నించాడు.దీనికి సంచాలక్ కాబట్టి అలా అరిచాను, అది తప్పు అయితే నామినేట్ చేయండని అన్నాడు షణ్ముఖ్ . రాత్రి సారి చెప్పింది.. గుంజిళ్లు తీసింది మాత్రం చెప్పవా?.. ప్రతీ అమ్మాయి దగ్గరకు వెళ్లి అలా చేస్తానా? అంటూ సిరి, జెస్సీల మీద షన్ను ఫైర్ అవుతాడు. ముందు మీ ఆట మీరు ఆడండి అని షన్ను అంటే.. నువ్ కూడా ముందు నీ ఆట నువ్ ఆడు అని సిరి అంటుంది.
షణ్ముఖ్ మాటలకు సిరి ఏడుస్తుంటే ప్రియాంక సెటైర్ వేసింది.అంత గ్రీజు పెట్టుకోవడం ఎందుకు అని అన్నది. దీనికి మానస్.. ఒకరు బాధలో ఉంటే ఇలాంటి జోకులు వేయోద్దు.. రేపు నువ్ కూడా అలానే ఏడిస్తే అందరూ అలానే అనుకుంటారు అని అన్నారు. నువ్వు ఆలోచించే విధానం చాలా తప్పు అని చెప్పుకొచ్చాడు. నీకేవరైనా హాని చేయాలనుకుంటే నాశనం అయిపోవాలి అని కోరుకుంటావు, అది నీ ఆలోచనా విధానం అని చెప్పడంతో పింకీ అలిగి వెళ్లిపోయింది.