Maname | టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచే ‘గమ్యం’, ‘యువసేన’, ‘అమ్మ చెప్పింది’, ‘వెన్నెల’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ నటుడికి ఇప్పటికి తెలుగులో బిరుదు లేదన్న విషయం తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా ఈవెంట్లో తన బిరుదును ప్రకటించారు మేకర్స్.
శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మనమే’ (Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్ షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌లతో పాటు తదితరులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.
Celebrating a journey of charm, excellence & versatility ❤️🔥#Sharwanand is now 🌟 CHARMING STAR SHARWA🌟 @ImSharwanand #CharmingStarSHARWA pic.twitter.com/qLPj6AcHGq
— Haricharan Pudipeddi (@pudiharicharan) June 5, 2024
అయితే ఈ వేడుకలోనే చిత్ర నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) అధినేత టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) శర్వానంద్‌కు బిరుదు ఇచ్చారు. చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa) అంటూ శర్వానంద్‌పై ప్రత్యేక వీడియో విడుదల చేశాడు. ఇక ఈ వీడియోను మీరు చూసేయండి.
ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.