Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad Garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ వింటేజ్ చిరు ఈజ్‌బ్యాక్ అని చెప్పకనే చెబుతోంది.
కాగా మేకర్స్ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త లుక్ ఒకటి షేర్ చేశారు. చిరంజీవి ఇద్దరు పిల్లలతో కలిసి సైక్లింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. చిరు ఈ సారి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా మారిపోయినట్టు ఈ పోస్టర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రంలోలేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ లాంచ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సాంగ్ ఇండియావైడ్‌గా యూట్యూబ్‌లో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో దసరా ఫేం షైన్ టామ్ చాకో కీ రోల్ చేస్తున్నాడని వార్తలు వస్తుండగా.. అనిల్ రావిపూడి టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔
Wishing everyone a safe, happy, and prosperous Diwali 💐
May this festival bring warmth to your hearts, success to your endeavors, and happiness to your homes✨ #ManaShankaraVaraPrasadGaru ❤️ pic.twitter.com/wTknQI7s2c
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025