Mana Shankara Vara Prasad Garu | మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ ప్రభంజనం కొనసాగిస్తోంది. తాజాగా ఈ చిత్రం థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకోగా.. ఈ 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.375 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి రూ.400 కోట్ల దిశగా దూసుకెళుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అలాగే ఈ చిత్రం తెలుగులో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్(All Time Regional Industry Hit) గా నిలిచి చరిత్ర సృష్టించినట్లు చిత్రబృందం ప్రకటించింది.
కేవలం తెలుగు వెర్షన్లో మాత్రమే విడుదలై ఈ స్థాయిలో రూ.375 కోట్లు రాబట్టడం టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డుగా ట్రేడ్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. చిరంజీవి తన మార్కు ‘వింటేజ్ స్వాగ్’ తో అలరించగా, అనిల్ రావిపూడి మార్కు వినోదం, విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. చిరంజీవి సరసన నయనతార నటించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి ప్రాంతీయ సినిమా సత్తాను చాటిచెప్పింది. కాగా, థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి Zee5 వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
₹375Crores+ Gross & counting for the ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #MSG ❤️🔥❤️🔥❤️🔥
With immense love from audiences across the globe, it’s 25 GLORIOUS DAYS at the box office for #ManaShankaraVaraPrasadGaru 🔥
Book your tickets now and experience the blockbuster magic in… pic.twitter.com/Wlhqc77H3B
— Shine Screens (@Shine_Screens) February 5, 2026