సూర్యతేజ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మన ఊరి ప్రేమాయణం’. సూర్యతేజ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ లోగోను లాంచ్ చేశారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సీనియర్ నటుడు సుమన్ ఈ లోగోను లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
చక్కని ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌గా రూపొందిన ఈసినిమా అందర్నీ అకట్టుకుంటుందని హీరో సూర్యతేజ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామసత్యనారాయణ, కె.ఎన్.రాజు, డీవోపీ, ఎడిటర్ ఉదయ్‌కుమార్ జి. తదితరులు పాల్గొన్నారు.