NTR Neel Jordan | యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ విదేశాల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ను ఫిబ్రవరి 5 నుంచి జోర్డాన్ దేశంలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. అక్కడ జరగబోయే ఈ కీలక షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా, జోర్డాన్ స్థానిక ప్రభుత్వం ఈ సినిమా షూటింగ్కు పూర్తి మద్దతును మరియు భరోసాను ప్రకటించింది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను అక్కడ చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ షూటింగ్ ప్రారంభానికి 2-3 రోజుల ముందే జోర్డాన్కు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అక్కడ షూటింగ్ వాతావరణానికి అలవాటు పడటంతో పాటు, తన పాత్రకు సంబంధించిన మేకోవర్ కోసం ముందే అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.