NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్.
ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నాడు అని అభిమానులు ఎదురుచూస్తుండగా.. వారికి గుడ్ న్యూస్ చెబుతూ.. ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
#NTRNeel is entering its most explosive phase 💥💥
Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️🔥❤️🔥#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm pic.twitter.com/z7hsCkhOY0
— Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2025