Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ అందాల తార మమతా కులకర్ణి స్వదేశం భారత్‌కు చేరుకున్నది. దాదాపు దాదాపు 25 సంవత్సరాల తర్వాత ముంబయిలో అడుగుపెట్టింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా మమతా భావోద్వేగానికి గురైంది. ముంబయికి రాగానే.. పాత జ్ఞాపాలన్నీ గుర్తుకు వచ్చాయంటూ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో మమతా కులకర్ణి వార్తల్లో నిలిచింది. 2016 ఏప్రిల్ 12న పోలీసులు రెండు వాహనాల నుంచి రెండు మూడు కిలోల ఎఫిడ్రిన్ పౌడర్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు మయూర్, సాగర్లను అరెస్టు చేశారు. ఇద్దరి వద్ద నకిలీ గుర్తింపు కార్డులు దొరికాయి. ఈ కేసులో పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. మమతా కులకర్ణితో సహా ఏడుగురిని మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు.
2016 జనవరిలో కెన్యాలో జరిగిన సమావేశానికి మమతా కులకర్ణి హాజరైందని.. నిందితుడు అయిన భర్త విక్కీ గోస్వామి తదితరులతో సమావేశంలో చర్చల్లో పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద 2016లో థానే పోలీసులు తనపై నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)ను రద్దు చేయాలని 2018లో మమతా కులకర్ణి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఆగస్టులో మాజీ హీరోయిన్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును హైకోర్టు కొట్టివేసిన కోర్టు.. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని చెప్పింది. ఈ కేసులో విచారణను కొనసాగించడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే తప్ప మరోటి కాదని జస్టిస్ భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 22 నాటి ఉత్తర్వుల్లో నటికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలు ప్రాథమికంగా ఆమెపై నేరం చేసినట్లుగా పరిగణించేందుకు సరిపోవన్న ధర్మాసనం స్పష్టం చేసింది.
సహ నిందితుడి వాంగ్మూలంపై సాక్ష్యాలు ఆధారపడి ఉన్నాయని, ఆమెకు వ్యతిరేకంగా ఖచ్చితమైన సాక్ష్యాలు లేవని పేర్కొంది. అయితే, మమతా కులకర్ణి తన భర్తతో కలిసి కెన్యాలో స్థిరపడింది. ఆమె భర్త డ్రగ్స్ కేసులో ఉన్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 1997లో యూఏఈలో 25 సంవత్సరాల శిక్షపడింది. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారడం, సత్ప్రవర్తణ కారణంగా 2012లో విడుదలయ్యారు. ఇదిలా ఉండగా.. 1990వ దశకంలో భారతీయ చిత్రపరిశ్రమలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగింది. బోల్డ్ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరుగా నిలిచింది. తన అందంతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఒంటిపై బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగజైన్’ కవర్ పేజీలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటో షూట్ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. హీరోయిన్‌గానే కాకుండా ఐటెమ్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరించింది. కెరియర్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైంది.