Mammootty | యాత్ర-2 కోసం మమ్ముట్టి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
Yatra-2 | సీక్వెల్లో మమ్ముట్టి కూడా కనిపించనున్నాడట. ఏదో గెస్ట్ అప్పియరెన్స్‌లా కాకుండా చాలా సేపు ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడట.
Yatra-2 | నాలుగేళ్ల కిందట వచ్చిన యాత్ర ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జీవించేశాడు. ఇక అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కాగా రీసెంట్గా ఈ సినిమా సీక్వెల్‌ను ఓ పోస్టర్‌తో అనౌన్స్‌చేశారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ ఓ డైలాగ్‌ను యాడ్ చేసి పోస్టర్‌ను వదిలారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో జగన్ పాత్రలో జీవా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్లో మమ్ముట్టి కూడా కనిపించనున్నాడట. ఏదో గెస్ట్ అప్పియరెన్స్‌లా కాకుండా చాలా సేపు ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడట. కాగా అందుకోసం మమ్ముట్టి ఏకంగా రూ.14 కోట్లు డిమాండ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. అయితే మేకర్స్ కూడా ఆయన చెప్పిన నెంబర్‌కు ఒకే అని కమిట్మెంట్ ఇచ్చేశారట. నిజానికి ఆ సినిమాకున్న డిమాండ్ అలాంటిది. అసలు మమ్ముట్టి అని సగం జనాలకు తెలియకుండా సినిమా కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు మమ్ముట్టి తెలుగు వారికి బాగా పరిచయస్తుడు అయ్యాడు. దాంతో మేకర్స్ కూడా మరో మాట ఆలోచించకుండా రెమ్యునరేషన్‌ను ఒప్పుకున్నారట.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. యూవి సంస్థతో కలిసి త్రీ సెల్యులాయిడ్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఈ తెరకెక్కిస్తుంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

