Mattancherry Mafia | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈద్ పండుగ కానుకగా ఈ అనౌన్స్మెంట్ రాగా.. ‘ఉండ’ (Unda) వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు ఖాలిద్ రెహమాన్ మరియు మమ్ముట్టి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మట్టాంచేరి మాఫియా’ (Mattancherry Mafia) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, యువ హీరోలు ఆసిఫ్ అలీ మరియు ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
కొచ్చిలోని మట్టాంచేరి నేపథ్యంతో సాగే ఈ సినిమా పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. భీష్మపర్వం వంటి గ్యాంగ్‌స్టర్ డ్రామా తర్వాత మమ్ముట్టి అలాంటి జానర్లో చేయబోతుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి రెక్స్ విజయన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ మరియు యూనివర్సల్ సినిమాస్ బ్యానర్లపై ఖాలిద్ రెహమాన్ మరియు బి. రాకేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Excited to present the title poster of my second collaboration with Khalid Rahman – #MattancherryMafia pic.twitter.com/umdHFiXt57
— Mammootty (@mammukka) March 20, 2026