ప్రేమలు, డ్యూడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ సోయగం మమితా బైజు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా కనిపించే ఈ సుందరికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య నటిస్తున్న తెలుగు సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో సూర్యకు జోడీగా నటిస్తున్నదీ అందాల భామ. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ సొగసరి మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. శర్వానంద్-శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కనున్న ‘జార్జ్‌క్రిష్’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో మమితాబైజు కథానాయికగా ఖరారైందని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుండగా.. ఇప్పటికే ఓ నాయికగా రుక్మిణి వసంత్‌ను ఖరారు చేశారు. రెండో కథానాయిక ఎంపిక కోసం పూజాహెగ్డేతో పాటు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు మమితాబైజుని ఖరారు చేశారని తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.