ఇటీవల విడుదలైన ‘ప్రేమలు’ చిత్రం ద్వారా యువతరం హృదయాలను దోచుకుంది మలయాళీ సోయగం మమతా బైజు. చూడముచ్చటైన అందం, అభినయంతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కథాంశాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్న ఈ భామ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది.
తాజాగా ఈ అమ్మడు తమిళంలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది. వివరాల్లోకి వెళితే..‘లవ్‌టుడే’ చిత్రంతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ప్రస్తుతం ఆయన కీర్తిశ్వరన్ అనే దర్శకుడితో సినిమా చేయబోతున్నారు. ఇందులో మమితా బైజు కథానాయికగా ఎంపికైంది.
‘రెబెల్’ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న తమిళ చిత్రమిది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. న్యూఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేస్తారని చెబుతున్నారు.