Mamannam Movie On Ott | మారి సెల్వరాజ్.. ఈ పేరుకు తమిళనాట ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దళితులు, కింద స్థాయి వాళ్లకు సమాజంలో ఎలాంటి గుర్తింపు ఉంది. వాళ్లని ఎలా చూస్తారు అనే నేపథ్యంలో సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన పరియారుమ్ పెరుమాళ్, కర్ణన్ సినిమాలు ఇదే కాన్సెప్ట్‌తో వచ్చి కోట్లు కొల్లగొట్టాయి. ఇక ఈ సారి ఆ కాన్సెప్ట్‌కు పొలిటికల్ టచ్ అప్ ఇచ్చి మామన్నమ్ తెరకెక్కించాడు. నెల రోజుల కిందట తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లను సాధించింది.
తెలుగులో నాయకుడు పేరుతో సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ సంస్థలు రెండు వారాల క్రితం ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రమోషన్లు లేకపోవడం, తమిళ ఫ్లేవర్ ఉండటంతో ఇక్కడ జనాలకు అంతగా నచ్చకపోవడంతో ఫస్ట్ వీకెండ్లోపే దుకాణం సర్దేసింది. ఇక మూడు రోజుల కింద ఈ సినిమాను నెట్‌ఫ్లెక్స్‌లో స్ట్రీమింగ్ చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా ఇప్పుడు ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ మధ్య కాలంలో తమిళ సినిమాకు ఈ రేంజ్లో ఓటీటీ రెస్పాన్స్ రావడం జరుగలేదు.
థియేటర్లలో జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీ ప్రియులు మాత్రం ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో వడివేలు కీలకపాత్ర పోషించగా.. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను రెడ్ జియాంట్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ స్వీయ నిర్మాణంలో రూపొందించాడు.
Even those drops of blood that were shed rejoice #Maamannan
Trending #1in India on #Netflix #MaamannanBlockbuster @Udhaystalin @RedGiantMovies_ @KeerthyOfficial #Vadivelu @arrahman #FahadhFaasil @thenieswar @editorselva @dhilipaction @kabilanchelliah @kalaignartv_off… pic.twitter.com/wRlcBXJEej
— Mari Selvaraj (@mari_selvaraj) July 30, 2023