Mama Mascheendra Movie | ‘సమ్మోహనం’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు (Sudheer Babu). ఇక అయన తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’(Mama Mascheendra). దుర్గా, పరశురామ్, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో సుధీర్ బాబు నటిస్తుండగా.. ఈ చిత్రానికి హర్షవర్థన్ (Harshavardhan) దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ లాంచ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అమీర్‌పేట్‌లోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : చైతన్ భరద్వాజ్.
Get ready for the ultimate dose of entertainment💥#MaamaMascheendra trailer launch tomorrow
📍AAA Cinemas,Hyd
⏰2PM onwardsIn cinemas OCT 6th🎥@isudheerbabu @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @SVCLLP #SrishtiCelluloids #SvcLLP @adityamusic @MediaYouWe pic.twitter.com/Y1PXvaeyOR
— Vamsi Kaka (@vamsikaka) September 26, 2023