Malvika Sharma | అందాల ముద్దుగుమ్మ మాళవిక శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ముంబైలోని మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ 2018లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమానే మాస్ మహరాజా రవితేజతో నటించే అవకాశం దక్కించుకున్న మాళవిక రెండో సినిమా రామ్‌తో కలిసి నటించింది.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా ఇందులో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. గోపీచంద్, సుధీర్ బాబు వంటి క్రేజీ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసింది.
తమిళంలో జీవా తో కూడా ఓ సినిమా చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ మాత్రం పడడం లేదు. అదే సమయంలో చేసిన ప్రతి సినిమాలోనూ ఈ అందాల తార అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. హీరోయిన్గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే లాయర్ గా కూడా ప్రాక్టీస్ చేస్తోంది. కథానాయకగా ఆవిడ చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ… యూత్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
సాధారణంగా మాళవిక సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అందిస్తుంది. కానీ ఇప్పుడు మాళవిక సడెన్ గా హాస్పిటల్ లో కనిపించింది అది కూడా హాస్పిటల్ డ్రెస్ లో. గ్లామరస్‌గా కనిపించే మాళవిక ఇలా ఆసుపత్రి డ్రెస్‌లో కనిపించే సరికి అందరు షాక్ అవుతున్నారు. తను షేర్ చేసిన వీడియోకి నవ్వండి, ఎందుకంటే అనుకోకుండా హాస్పిటల్ డ్రెస్ లో ఇరుక్కునిపోయి, చుట్టూ ఏవేవో మిషన్స్ ఉన్నప్పుడు అంతకంటే ఏం చేస్తాం? అయినా ఈ డ్రెస్ లో కూడా అందంగా కనిపిస్తున్నాంటూ షేర్ చేసింది. అసలు మాళవిక హాస్పిటల్ కు వెళ్లడం వెనుక ఉన్న కారణమేంటనేది తెలియక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.