Lokah Movie | మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన లోక చాఫ్టర్ 1 చంద్ర (Lokah Chapter 1 Chandra) (తెలుగులో కొత్త లోక) చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా బృందం తాజాగా ప్రతిష్టాత్మక హాలీవుడ్ మ్యాగజిన్పై కవర్‌స్టోరీగా నిలిచి మలయాళ చిత్ర పరిశ్రమ కీర్తిని మరింత పెంచింది. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (The Hollywood Reporter India) అనే పేరుతో ఇండియాలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ నెలకు సంబంధించిన మ్యాగజిన్ కవర్పేజిపై ‘లోక’ సినిమాను ప్రచూరించింది. ఇందులో భాగంగా చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్‌తో పాటు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, దర్శకుడు డామినిక్ అరుణ్ మ్యాగజిన్ కవర్‌పై బ్లాక్ సూట్లో మెరిశారు. సూపర్ హిట్ అనే పేరుతో ఈ సంచిక అక్టోబర్ నెలలో బయటికి రాబోతుంది.
#THRIndia Exclusive: #DominicArun, @kalyanipriyan, & @dulQuer a.k.a the team behind the highest grossing Malayalam film of all time, #LokahChapter1Chandra, are the cover stars for the October issue of our magazine. On stands now.
Location Courtesy: Old Harbour Hotel, Fort Kochi pic.twitter.com/eF5sHDaHlz
— The Hollywood Reporter India (@THRIndia_) September 30, 2025