Adah Sharma | మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ తీవ్రతపై జస్టిస్ కె.హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పుణ్యమా అని.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాస్టింగ్ కౌచ్ అనేది చర్చనీయాంశంగా మారింది. తాజాగా నటి ఆదాశర్మ ఓ ప్రైవేటు ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కాస్టింగ్ కౌచ్‌కి సంబంధించిన ప్రశ్న ఆమెకు ఎదురైంది. మీ కెరీర్లో మీరెప్పుడైనా కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నారా? అని ఆదాను అడగ్గా..
‘మీకు తెలీని విషయం ఏంటంటే.. నాకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసు. నాన్‌చాకు తిప్పడంలో నేను ఎక్స్పర్ట్. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తానో.. నాతో ఎవరైనా మిస్‌బిహేవ్ చేస్తే అంతే వేగంగా స్పందిస్తా. పక్కవాళ్ల అభిప్రాయాలు అస్సలు తీసుకోను. మనం ఏ రంగంలో ఉన్నా సపోర్ట్, నెట్వర్క్ అవసరం. నాకైతే నా ఇండస్ట్రీలో మద్దతిచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే.. నా గురించి పూర్తిగా తెలిసిన ఎవరూ నా జోలికి రారు.’ అంటూ అందంగా నవ్వేసింది ఆదాశర్మ.