న్యూఢిల్లీ : మలయాళం సినీ నటుడు ఉన్ని ముకుందన్.. ప్రధాని మోదీ పాత్రను పోషించనున్నారు. మోదీపై తీస్తున్న బయోపిక్(PM Modi Biopic)లో అతను ఆ రోల్ ప్లే చేయనున్నారు. అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ ఫిల్మ్‌కు మా వందే అని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీల్లో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రఖ్యాత ఫిల్మ్‌మేకర్ క్రాంతి కుమార్ సీహెచ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.
ప్రధాని మోదీ పాత్రలో నటించనున్నానని, ఈ విషయాన్ని పంచుకునేందుకు సంతోషిస్తున్నానని, మా వందే టైటిల్‌తో ఆ ఫిల్మ్ రిలీజ్ కానున్నదని నటుడు ఉన్ని ముకుందన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇవాళ ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవం సంద్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదని ఆ ఫిల్మ్‌కు ట్యాగ్‌లైన్ ఇచ్చారు.
అహ్మాద్బాద్లోనే పెరిగానని, తన చిన్నతనంలో మోదీని సీఎంగా చూశానని, ఆ తర్వాత 2023 ఏప్రిల్‌లో ఆయన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నానని, ఆ సమయంలో మోదీపై తనకు ప్రత్యేక అభిమానం కలిగినట్లు ముకుందన్ తెలిపారు. ఓ నటుడిగా ప్రధాని మోదీ పాత్రను పోషించడం పట్ల సంతోషంగా ఫీలవుతున్నానని, ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉందన్నారు.
ప్రధాని మోదీ రాజకీయ జీవితం అసాధారణంఆగ సాగిందని, అయితే తాము తీయబోయే సినిమాలో మోదీని మరో కోణంలో చూపిస్తామని, తన మాతృమూర్తితో ఉన్న అనుబంధాన్ని ఆ ఫిల్మ్‌లో ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు నటుడు ఉన్ని ముకుందన్ తెలిపారు. ఎవరి ముందు తలవంచవద్దు అని గుజరాతీలో మోదీ చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. ప్రధాన భాషల్లో మా వందే సినిమాను తీస్తామని, ఆ తర్వాత దాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్చేయనున్నట్లు ఆయన చెప్పారు. మోదీ బర్త్‌డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలిపారు.