Mohan Lal | మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులే స్వయంగా వెల్లడించారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేవరకు 5 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. సినిమా షూటింగ్‌లకు కొన్నిరోజులు విరామం ఇవ్వడంతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో తిరగాలని వైద్యులు తెలిపారు.
ఇక మోహన్‌లాల్ ఆస్పత్రిలో చేరినట్లు వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవడంతో పాటు ఆసుపత్రికి తరలివచ్చారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Wishing @Mohanlal a speedy recovery! ❤️🩹 pic.twitter.com/DjcRzrOdwV
— Sangeeth Vatakara (@sangeethvtk) August 18, 2024