టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ (Pakka Commercial)సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో మారుతితో చేస్తున్న సినిమా రద్దు చేయాలని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు నెట్టింట తెగ రిక్వెస్టులు పెట్టారు. అయితే ప్రభాస్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు మరో వార్త కూడా బయటకు వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకుంది సోషల్ మీడియా సోయగం మాళవికా మోహనన్ (Malavika Mohanan). ఈ కోలీవుడ్ భామ నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక స్టిల్ షేర్ చేస్తూ..అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది. ప్రభాస్ సినిమాతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న మాళవికకు ఈ చిత్రం డ్రీమ్ ప్రాజెక్టు అట. ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్న ఈ సినిమాతో తెలుగులో ఎలాగైనా మంచి ఫేమ్ సంపాదించాలనుకుంటుందట మాళవిక.
అయితే మూవీ ఆలస్యమవుతుండటంతో ఈ భామ కొంత ఆందోళనగా ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్-మారుతి నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. మరోవైపు నిర్మాత డీవీ దానయ్య మాత్రం ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని, త్వరలోనే సినిమా మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ కూడా ఉంది.
ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో ఉండబోతుందని కొందరు అంటుండగా..మరోవైపు యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఇంకొందరు అంటున్నారు.