ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నది కథానాయిక మాళవిక మోహనన్. ఈ సినిమా విడుదలకు ముందే మాళవికకు యూత్‌లో ఓ రేంజ్లో క్రేజ్ ఏర్పడిపోయింది. ‘రాజాసాబ్’ గురించి తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది మాళవిక మోహనన్. ‘ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.
నిజానికి టాలీవుడ్ ఎంట్రీకోసం ఎన్నో కథలు విన్నాను. చివరకు ‘రాజాసాబ్’ నా తెలుగు డెబ్యూ అయ్యింది. ఈ విషయంలో నిజంగా నేను లక్కీ. ఇదొక రొమాంటిక్ హారర్ కామెడీ డ్రామా. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ప్రస్తుతం సగం షూటింగ్ పూర్తయింది’ అని తెలిపింది మాళవిక మోహనన్.
ప్రభాస్ గురించి మాట్లాడుతూ ‘ప్రభాస్ లాంటి వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. ఎదుటివారికి అన్నంపెట్టి, వారు తింటుంటే ఆయన ఆనందిస్తుంటాడు. ప్రభాస్ ఇంటి భోజనానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. భోజనం అంటే బిర్యానీనో, లేక రెండుమూడు కర్రీలతో వైట్‌రైస్ భోజనమో కాదు, ఏకంగా పెద్దపెద్ద పాత్రలతో ఒక ఊరికి సరిపోయేంత భోజనాన్ని లొకేషన్‌కి తెప్పిస్తాడు. నా లైఫ్‌లో అంత రుచికరమైన భోజనం నేను తినలేదు. ఆయన మంచి మనసుకు ఇదే పెద్ద నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక.