Malavika Mohanan | దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన అందంతో, నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించిన మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఇప్పుడు టాలీవుడ్లో అడుగుపెడుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ది రాజా సాబ్” చిత్రంతో ఆమె తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది. తాజాగా ఆమె ఈ మూవీపై, ముఖ్యంగా ప్రభాస్‌పై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న మాళవిక మోహనన్, “ది రాజా సాబ్”లో తన పాత్రపై మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
స్టార్ హీరోల సినిమాల్లో సాధారణంగా హీరోయిన్ పాత్ర 4–5 సీన్స్, ఒకటి రెండు పాటలకు పరిమితం అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో కూడా అలా ఉంటుందని అనుకున్నా. కానీ నాకు ఇచ్చిన పాత్ర మాత్రం చాలా ప్రత్యేకమైనది. నా తెలుగు డెబ్యూ సినిమా ఇలా ఒక మంచి రోల్ ఇవ్వడం నా అదృష్టం” అంటూ ఆమె తెలిపింది. ఈ వ్యాఖ్యలతో సినిమాలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో స్పష్టమవుతోంది. ప్రభాస్‌తో నటించడం నాకు గౌరవం అంటూ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశంపై మాళవిక తన ఆనందాన్నివ్యక్తం చేసింది. “భారతదేశంలోనే అత్యంత పెద్ద సూపర్స్టార్లలో ఒకరైన ప్రభాస్‌తో నటించడం నాకు గౌరవం. ఇదొక స్పెషల్ ఫీలింగ్” అని చెప్పి అభిమానులను మరింత ఎగ్జైట్ చేసింది.
ప్రభాస్–మాళవిక జంటగా రొమాంటిక్ సీన్లుతో పాటు హారర్, సూపర్‌నేచురల్ సన్నివేశాలు కూడా సినిమాలో భాగమని టాక్. మారుతి దర్శకత్వంలో హారర్–కామెడీ–రోమాన్స్ మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న “ది రాజా సాబ్” లో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌ల్లో ఒకటి. మాళవిక మోహనన్ వ్యాఖ్యలతో “ది రాజా సాబ్”పై హైప్ మరింత పెరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూనే హాట్ టాపిక్‌గా మార్చేశారు.