నిజమైన ఫ్యాషన్ అంటే ఏంటో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మలయాళ మందారం మాళవిక మోహనన్. నేటి ఫ్యాషన్ల గురించి ఆమె మాట్లాడుతూ ‘కొందరు ట్రెండీగా ఉండేందుకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్యాషన్ వస్ర్తాలన్నింటినీ ధరిస్తుంటారు. ముఖ్యంగా వేడుకల్లో ఈ ధోరణి ఎక్కువైపోయింది. నావరకూ నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వను.
ఇండియా లాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు దేశ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. చేనేత చీరలు కట్టుకునే మా అమ్మను చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగిన నాకు అసలైన సౌందర్యం ఏంటో అప్పుడే అర్థమైంది. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే చీర కట్టుకుని, నుదుటిన ఎర్రని బొట్టు పెట్టుకుని, కళ్లకు కాటుక, తలలో పూలతో నిండుగా తయారైతే అంతకు మించిన గొప్ప ఫ్యాషన్ మరొకటి ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్.