Malavika Mohanan | ఈ మధ్య సీనియర్ హీరోలకి సరైన జోడి దొరకడం లేదు. వారి వయస్సుకి సరిజోడు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు యంగ్ హీరోయిన్స్‌తో జట్టు కడుతున్నారు. అప్పుడు కొంత నెటిజన్ల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఆ వయస్సులో యంగ్ భామలతో రొమాంటిక్ ఏంటని తిట్టిపోస్తున్నారు. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం హృదయపూర్వం చిత్రంలో నటిస్తుండగా, ఇందులో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయినట్లు మాళవిక మోహనన్ తెలియజేస్తూ మాళవిక తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది.
దీనిపై కొందరు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. “65 ఏళ్ల ముసలాయన.. 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణమా? ఈ ముసలి హీరోలు వారి వయసుకు తగిన పాత్రలు కాకుండా ఇలాంటి వాటిపై ఎందుకు ఆసక్తి చూపిస్తారో అని అర్ధం వచ్చేలా కామెంట్ చేశాడు. అయితే ఈ కామెంట్‌పై మాళవిక మోహనన్ సీరియస్‌గా రెస్పాండ్ అయింది. సినిమాలో అతను నన్ను ప్రేమిస్తాడు అని నీకెవరైన చెప్పారా, నువ్వే ఏవో కథలు అల్లేసుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నావ్.. నువ్వు ఏదో ఊహించుకొని అవతలి వారి నిందిస్తున్నావు అంటూ ఘాటుగానే బదులిచ్చింది మాళవిక. ఆ తర్వాత ఈ కామెంట్స్ డిలీట్ చేసినట్టు అర్ధమవుతుంది.
మాళవిక గతంలో కూడా నెటిజన్స్‌కి గట్టిగానే బదులిచ్చింది. తనపై ఎవరైన నెగెటివ్ కామెంట్ చేస్తే అస్సలు ఊరుకోదు. ఈ అమ్మడి కెరియర్ ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. తెలుగు, తమిళంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఇక ‘హృదయపూర్వం’ సినిమా విషయానికి వస్తే, దీనికి సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటోని పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత ఏడాది ‘తంగలాన్’, ‘యుద్ర’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మాళవిక మోహనన్ ప్రస్తుతం ‘ద రాజా సాబ్’, ‘సర్దార్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైంది.