Malavika Mohanan | బాలీవుడ్ స్టార్హీరో విక్కీ కౌశల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నది యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఇండస్ట్రీలోనే కాదు.. తన జీవితంలోనే మొదటి స్నేహితుడు విక్కీనే అంటున్నది. ఇద్దరివీ సినీ నేపథ్యమున్న కుటుంబాలే! మాళవిక తండ్రి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కాగా.. ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ కుమారుడు విక్కీ కౌశల్. దాంతో వీరిద్దరి కుటుంబాలూ ముంబైలో ఇరుగుపొరుగునే ఉండేవట. బాల్యం నుంచే ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేదట.
తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో మాళవిక మాట్లాడుతూ.. తన బాల్య సంగతులు, విక్కీతో అనుబంధం గురించి పంచుకున్నది. “నాకు ఊహ తెలిసినప్పటి నుంచే విక్కీతో పరిచయం ఉంది. అప్పటి నుంచీ మా స్నేహం కొనసాగుతూనే ఉంది. చిన్నప్పుడు మా అమ్మ చేసే మలయాళీ వంటల్ని విక్కీ ఎంతో ఇష్ట పడేవాడు. అందుకే, తరచుగా మా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకొంటూ, భోజనం చేసేవాళ్లం” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక విక్కీ డ్యాన్సింగ్ ట్యాలెంట్ గురించీ వెల్లడించింది మాళవిక. చిన్నప్పటి నుంచే విక్కీ బాగా డాన్స్ చేసేవాడట. వేడుక ఏదైనా డ్యాన్స్‌తో అదరగొట్టేవాడంటూ బాల్య సంగతులను గుర్తు చేసుకున్నది. తామిద్దరం తరచుగా కలుస్తూనే ఉంటామనీ, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటామని వెల్లడించింది. సినిమాలు, కెరీర్‌కు సంబంధించిన సీరియస్ విషయాలపై తామెప్పుడూ చర్చించలేదని చెప్పుకొచ్చింది. 2013లో వచ్చిన మలయాళ చిత్రం ‘పట్టం పోలె’తో ఇండస్ట్రీలోకి వచ్చింది మాళవిక. ఆ తర్వాత రెండేళ్లకు ‘మసాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు విక్కీ కౌషల్. కెరీర్ మొదట్లో కొన్ని బాలారిష్టాలు ఎదుర్కొన్నా.. ప్రస్తుతం వీళ్లిద్దరూ స్టార్లుగా ఎదిగిపోయారు. మలయాళంతోపాటు తమిళం, హిందీలో సినిమాలు చేస్తున్న మాళవిక.. తాజాగా ‘ది రాజా సాబ్’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ సరసన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. కార్తీతో చేసిన ‘సర్దార్ 2’ కూడా త్వరలోనే విడుదల కానున్నది. ఇక విక్కీ విషయానికి వస్తే.. గతేడాది వచ్చిన హిస్టారికల్ చిత్రం ‘ఛావా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దాదాపు రూ. 807 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ సినిమా చేస్తున్నాడు.