Malavika Menon | ఈ రోజుల్లో అందాల ముద్దుగుమ్మలు గ్లామర్ షో చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా ఆఫర్స్ తగ్గిన సమయంలో నిత్యం అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే గ్లామర్ షో సమయంలో కొందరు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మని దారుణంగా ట్రోల్ చేయడంతో ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. నేను ఒక్క దానినే అందాలు ఆరబోయడం లేదు.. మిగతా హీరోయిన్స్ కూడా అదే చేస్తున్నారంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరని మీరు అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మీనన్.
2011లో మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇప్పటివరకు 60పైనే సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఈ భామ నటించిన రెండు మలయాళ చిత్రాలు తంకమణి , వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కొచ్చి విడుదలై మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్ము అందాల వడ్డింపులో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. తరచు తన గ్లామర్ షోతో రచ్చ చేస్తూనే ఉంటుంది. అయితే దీనిపై కొందరు నెటిజన్స్ ట్రోల్ చేశారు. అవకాశాల కోసమే మాళవిక అలా తన బాడీ చూపించుకుంటుందని కొందరు కామెంట్స్ చేశారు.
దీని గురించి తాజాగా స్పందించిన మాళవిక మీనన్.. నేను ఎప్పుడు కూడా ఛాన్స్‌ల కోసం గ్లామర్ షో చేయలేదు. అయిన అందాలు చూపించడంలో తప్పేంటి. మలయాళ చిత్రాలలో ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ ఉండదు. తెలుగు, తమిళ భాషలలోనే అలా నటించవచ్చు. ముఖం చూపించకుండా సోషల్ మీడియాలో నా గురించి రాసే వారిని నేను పట్టించుకోను. అయిన నేను ఒక్క దానినే గ్లామర్ ఫొటోలు షేర్ చేయడం లేదు, చాలా మంది హీరోయిన్స్ అలానే చేస్తున్నారు అని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.