Malaika Arora | 50 ఏళ్ల వయసులోనూ యువతకు గ్లామర్ గోల్స్ ఇస్తూ ఏజ్‌లెస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. అందాల ప్రదర్శన, ఫ్యాషన్ సెన్స్ విషయంలో తనకు తానే పోటీగా నిలిచే మలైకా, ఈ క్రిస్మస్ సీజన్లోనూ బాలీవుడ్ పార్టీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలంతా క్రిస్మస్ను ఘనంగా జరుపుకుంటున్న వేళ, మలైకా మాత్రం పార్టీ క్రౌడ్‌ను అస్సలు మిస్ కావడం లేదు. తాజాగా జరిగిన క్రిస్మస్ పార్టీకి ఆమె రెడ్ థీమ్ డ్రెస్‌లో హాజరై మరోసారి తన ఫ్యాషనిస్టా అవతారాన్ని చూపించింది. బటన్‌లెస్ రెడ్ ఫ్రాక్‌లో థై షోస్ చేస్తూ కనిపించిన మలైకా, ఈవెంట్లో ఎప్పటిలాగే షో స్టాపర్‌గా నిలిచింది.
కారు దిగి వేదిక వైపు నడుస్తున్న క్షణాల నుంచే ఫోటోగ్రాఫర్లు ఆమె వెంట పడిపోయారు. ఒక్కో యాంగిల్లో ఆమె ఇచ్చిన పోజులు, స్టైలిష్ వాక్ వీడియోలు, ఫోటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాడీ హగ్గింగ్ రెడ్ డ్రెస్‌ను జాగ్రత్తగా సర్దుకుంటూ, కాన్ఫిడెంట్‌గా నడిచిన మలైకా లుక్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎక్కడ కనిపించినా అల్ట్రా గ్లామ్ స్టైల్‌తో హీట్ పెంచే మలైకా, ఈ క్రిస్మస్ పార్టీలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఆమెను చూసి జెన్ జెడ్ కూడా ఇలాంటి స్టైల్ ఫాలో కావడానికి వెనకాడుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక టీవీ షోలు, రియాలిటీ ఈవెంట్లలో మలైకా చూపించే మోడ్రన్ అప్పియరెన్స్, బోల్డ్ లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కెమెరాల ఫోకస్ తనపైనే ఉండేలా చేసుకోవడంలో మలైకా స్టైల్, స్ట్రాటజీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. క్రిస్మస్ పార్టీలో మరోసారి తన డ్యాషింగ్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను మైండ్ బ్లాంక్ చేయడంలో మలైకా పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.