Malaika Arora | స్వేచ్ఛగా జీవించడంపై నిర్భయంగా మాట్లాడడంలో ఎప్పుడూ ముందుంటుంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. మాజీ భర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన ఆమె, తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరూ పబ్లిక్‌లో బహిరంగంగా కనిపిస్తూ వార్తల్లో నిలిచారు. అర్జున్‌తో తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మలైకా అనేకసార్లు బహిరంగంగా మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తితో సంబంధం కలిగి ఉండడంలో తప్పేమీ లేదు. ఇందుకు పెళ్లి అవసరం లేదు. జీవితాన్ని స్వేచ్ఛగా, సంతోషంగా గడపగలగడమే ముఖ్యం అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది ఆమె స్పష్టతను మెచ్చుకోగా, మరికొందరు ఇలాంటి విషయాలు బహిరంగంగా చెప్పడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా మళ్లీ డేటింగ్ లైఫ్‌కి దూరంగా ఉన్నట్లు భావించారు.
అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఎన్రిక్ ఇగ్లేసియాస్ కచేరీలో 30 ఏళ్ల యువకుడితో కలిసి కనిపించడంతో, ఆమె మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. కచేరీలో మలైకా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ, పాప్ సాంగ్స్‌తో పాటుగా హమ్ చేస్తూ కనిపించగా, ఆమె పక్కన ఉన్న ఆరున్నర అడుగుల ఎత్తైన యువకుడి వ్యక్తిత్వం ఆసక్తిని రేకెత్తించింది. ఆ యువకుడు ఎవరో తెలుసుకునేందుకు మీడియా, అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మలైకా వ్యక్తిగత జీవితం మళ్లీ గాసిప్స్ కేంద్రంగా మారింది. ఇన్నిరోజులుగా మలైకాపై గాసిప్స్ తగ్గిపోయినా, ఈ సంఘటనతో మళ్లీ కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇక మలైకా కుమారుడు అర్హాన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం కూడా చర్చనీయాంశం అవుతోంది. అర్హాన్ని బాలీవుడ్లో గ్రాండ్‌గా లాంచ్ చేయాలన్న ఆలోచనలో మలైకా ఉన్నారని తెలుస్తోంది.