The Taj Story Trailer | బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద చిత్రం ‘ది తాజ్ స్టోరీ’ (The Taj Story). ఈ సినిమాకు తుషార్ అమ్రిష్ గోయెల్ దర్శకత్వం వహిస్తుండగా.. జాకీర్ హుస్సేన్, అమృతా ఖాన్విల్కర్, నమిత్ దాస్, స్నేహ వాఘ్, శిశిర్ శర్మ, బ్రిజేంద్ర కలా, అఖిలేంద్ర మిశ్రా, శ్రీకాంత్ వర్మ, అనిల్ జార్జ్, సిద్ధార్థ్ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. పరేష్ రావల్ ఇందులో విష్ణు దాస్ అనే తాజ్ మహల్ గైడ్ పాత్రలో నటిస్తున్నాడు. తాజ్ మహల్ ఒకప్పుడు హిందూ దేవాలయం అని ఆయన వాదిస్తూ ఆ వాదనను కోర్టులో నిరూపించడానికి న్యాయ పోరాటం చేస్తారు. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ లాగానే ఈ చిత్రం కూడా బీజేపీ ప్రాపాగండా చిత్రం అని కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలావుంటే ఈ ట్రైలర్లో చిన్న పోరపాటును చేశారు మేకర్స్. ఒక ముఖ్యమైన సన్నివేశంలో తాజ్ మహల్‌ను వివాదాస్పదం చేస్తూ కోర్టులో వాదనలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా తాజ్ మహల్ చరిత్రను వ్యతిరేకించే (Anti) వాదనలకు సంబంధించి యాంటీ కార్డు వేయాల్సి ఉంటుంది. అయితే మేకర్స్ ఇంగ్లీష్‌లో Anti అనే పదానికి బదులుగా Aunty అని టైటిల్‌ను కార్డుపై రాశారు. దీంతో ఈ విషయంపై నెట్టింటా ట్రోలింగ్ జరుగుతుంది.
Aunty national, Aunty 🤣🤣🤣 pic.twitter.com/osZXqdNKDs
— Prayag (@theprayagtiwari) October 17, 2025