టాలెంటెడ్ హీరో కార్తీ (karthi) నటించిన మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ సర్దార్ (Sardar). పీఎస్ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా.. నిర్మాతలకు కాసులు కురిపించింది. సర్దార్ టీం సర్ప్రైజ్ అప్డేట్తో వార్తల్లో నిలిచింది. తాజా అప్డేట్ ప్రకారం లీడ్ యాక్టర్లు, ఇతర చిత్రయూనిట్‌కు రూ.30వేల విలువైన సిల్వర్ వాటర్ బాటిల్స్ ను బహుమతిగా అందించారు మేకర్స్ .
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచిస్తూ.. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆకర్షిస్తోంది. సర్దార్ విడుదలైన కొన్ని రోజులకే సీక్వెల్ సర్దార్ 2ను కూడా ప్రకటించింది కార్తీ-పీఎస్ మిత్రన్ టీం. ప్రస్తుతం కార్తీ నటిస్తోన్న ఖైదీ 2 షూటింగ్ పూర్తయిన తర్వాత సర్దార్ 2 సెట్స్‌పైకి వెళ్లనుంది.
సర్దార్ సక్సెస్‌తో నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్ లక్ష్మణ్‌కుమార్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్‌కు టయోటా కారును బహుమతిగా అందించిన విషయం తెలిసిందే. మిషన్ కంబోడియా త్వరలో మొదలవుతుంది.. అంటూ మేకర్స్ ఇప్పటికే సర్దార్ 2 అప్డేట్ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. సర్దార్ 2 2023లో విడుదల కానుంది. మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
After the blockbuster success of #Sardar, Producer @lakku76 presented a brand new car to director @Psmithran . Actor @Karthi_Offl handed over the key pic.twitter.com/9XBzIDE5TR
— Rajasekar (@sekartweets) November 2, 2022