Venkatesh | అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ 90శాతం పూర్తయింది. తాజాగా చిత్రబృందం డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో వేడుకను తలపించింది.
వెంకటేశ్, అతని భార్య పాత్ర పోషిస్తున్న ఐశ్వర్యరాజేశ్, వారి కుటుంబం అంతా ఉత్సాహంగా కనిపించారు. వెంకీ చరిష్మా, అనిల్ రావిపూడి హ్యూమర్.. ఆడియన్స్‌కి ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో వెంకీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేశ్, వీటీ గణేశ్, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాత: శిరీష్, సమర్పణ: దిల్‌రాజు.