వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే రొమాంచితమైన యాక్షన్ చిత్రమిది. వరుణ్‌తేజ్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో ఉంటుంది. డబ్భుశైతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో మిగతా భాగం తాలూకు షూటింగ్‌ను ఆరంభిస్తాం. వరుణ్‌తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తాం. దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ భారీ స్టేడియం సెట్‌ను సిద్ధం చేశారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుపుతాం. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, సంగీతం: తమన్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.