Maharaja | తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మహారాజా (Maharaja). భారీ అంచనాల నడుమ 2024 జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టడమే కాకుండా విజయ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది ఈ చిత్రం.
అయితే థియేటర్ అనంతరం ఓటీటీలోకి వచ్చిన కూడా ఈ చిత్రం రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ మూవీ చూసిన కోలీవుడ్ హీరో, తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్‌తో పాటు రజనీకాంత్ చిత్రంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా.. చిత్ర దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌ను కలుసుకుని ప్రత్యేకంగా అభినందించాడు. అయితే ఇంత పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా దర్శకుడికి చిత్రనిర్మాతలు భారీ సర్ప్రైజ్ను అందించారు.
ఈ సినిమా సాధించిన విజయం పట్ల దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు లగ్జరీ బీఏండబ్యూ కారును గిప్ట్గా అందించారు. నటుడు విజయ్ సేతుపతితో పాటు నిర్మాతల చేతుల మీదుగా ఈ బహుమతిని నిథిలన్ స్వామినాథన్ అందుకున్నాడు. ఈ విషయాన్ని నిథిలన్ స్వామినాథన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
Thank u so much @Sudhans2017 and @Jagadishbliss for this wonderful gift Thank you one an all who all made this possible @VijaySethuOffl @PassionStudios_ @TheRoute #Maharaja #Maharaja_100_days pic.twitter.com/usanP3qFvi
— Nithilan Saminathan (@Dir_Nithilan) October 6, 2024