ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ లీడ్ రోల్లో నటిస్తుండగా..శోభితా ధూళిపాళ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. డైరెక్టర్ శశి కిరణ్ టిక్కా తండ్రి సూర్య నారాయణ కన్నుమూయడం, మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా మేజర్ టీజర్ లాంఛింగ్ ఈవెంట్ వాయిదా పడ్డది.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు అడివి శేష్. జాతీయ స్థాయి చిత్రానికి ముంబైలో పెద్ద స్థాయిలో ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశాం. షెడ్యూల్లో మార్పులు చేశాం. నెక్ట్స్ అప్ డేట్ తెలియజేస్తాం. ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా బుల్లెట్..అంటూ సినిమా డైలాగ్‌ను క్యాప్షన్ గా ఇచ్చాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 28న టీజర్ లాంఛ్ చేయాల్సి ఉంది.
Wanted to do a national event for this national film in Mumbai in a big way.
— Adivi Sesh (@AdiviSesh) March 25, 2021
Slight change of plans 🙂 Will keep you updated.
Eppudu occhaam anadhi kaadhu annaya…Bullet….(well you get the idea) 🤗
Reporting soon! #MajorTheFilm pic.twitter.com/M8hIpr1ZYl