విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న యువ నాయకుడు మేజర్. ఎక్కువశాతం దేశభక్తి, థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేస్తున్న అడివి శేష్ ప్రస్తుతం.. 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్నమేజర్ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా వలన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది.
ఈ చిత్రం ఫైనల్ మిషన్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి కాశ్మిర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమాని అందించాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఇటీవల పేర్కోన్నాడు అడివి శేష్. అంతే కాకుండా ఈ చిత్రాన్ని కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా మహేష్ మరియు సోనీ పిక్చర్స్ వాలారు నిర్మాణం వహిస్తున్నారు.
తాజాగా చిత్ర బృందం “మేజర్” చివరి షూటింగ్ షెడ్యూల్ను ప్రారంభించింది. మేకర్స్ శేష్ తో సాయి మంజ్రేకర్ పై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ)లో ఉన్న రోజుల్లో శేష్ “మేజర్” సందీప్ ఉన్నికృష్ణన్గా ఉన్న పిక్ ను పోస్ట్ చేశారు. ఎన్డిఎ యూనిఫాంలో క్లీన్-షేవ్ లుక్ తో శేష్ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.