Mazaka Producer | సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా.. రావు రమేష్ కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఈ సినిమా పరాజయం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నిర్మాత రాజేష్ దండా బయ్యర్లను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.
సినిమా నష్టాలపై నిర్మాత రాజేష్ దండ ఇటీవల బయ్యర్లతో సమావేశం కాగా.. ఈ సమావేశంలో నష్టపోయిన బయ్యర్లకు డబ్బులను తిరిగి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. అమ్మిన రేటును బట్టి బయ్యర్లకు వచ్చిన నష్టాలతో పాటు జీఎస్టీ కలిపి మొత్తం నాలుగు కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చారు. సినిమా నిర్మాణానికి భారీగా ఖర్చు చేసి, నష్టాలు వచ్చిన తర్వాత కూడా బయ్యర్లను ఆదుకున్న రాజేష్ దండా నిర్ణయం సినీ పరిశ్రమలో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్, మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.