సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న 30వ చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్, హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. రీతూవర్మ కథానాయిక. శివరాత్రి కానుకగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇన్నోవేటివ్ పంథాను ఎంచుకొని ఈ సినిమా పాట షూటింగ్‌ను లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ‘తొలిసారి ఇలా లైవ్ షూటింగ్‌ని చూపించడం ఆనందంగా ఉంది.
చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. ప్రస్తుతం ‘రావులమ్మ..’ అనే రెండో పాట చిత్రీకరణ జరుపుతున్నామని, దాదాపు డబ్బు మంది డ్యాన్సర్స్‌తో శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో పాట అద్భుతంగా వస్తున్నదని, ఇదొక జానపదగీతమని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెలిపారు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి లియోన్‌జేమ్స్ సంగీతాన్నందిస్తున్నారు.