Double Ismart Movie | మూడు నెలల కిందట ప్రారంభమైన డబుల్ ఇస్మార్ట్ చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని ఇన్సైడ్ టాక్. బిగ్ బుల్గా సంజయ్ దత్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చివరి దశకు వచ్చేసిందట. లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కాస్త సైలెంట్ అయిన పూరి.. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇక అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అన్నది ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగా పాన్ ఇండియా సినిమా కాబట్టి హిందీ కంపోజర్‌ను పెట్టుకుందామని అనుకున్నారట. కానీ అది కుదరలేదు.
ఇక అనిరుధ్, థమన్ పేర్లు కూడా గట్టిగా వినిపించాయి. కానీ ఇప్పుడు వాళ్లకున్న బిజీ షెడ్యూల్స్‌లో అనుకున్న డేట్లో మ్యూజిక్‌ను రాబట్టకోవడం చాలా కష్టం. పైగా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కు ఐదు నెలలు మాత్రమే మిగిలింది. దాంతో మళ్లీ మణిశర్మ వైపే చిత్ర యూనిట్ మొగ్గుచూపుతుందట. నిజానికి ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద విజయం సాధించిందంటే దానికి మేజర్ కారణం మణిశర్మ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ సంగీతమే. అయితే ఆ మధ్య పూరికి, మణిశర్మకు చెడిందని.. దాంతో డబుల్ ఇస్మార్ట్ కోసం కొత్త సంగీత దర్శకుడుని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతుందో తెలీదు కానీ సోషల్ మీడియాను మాత్రం ఊపేసింది.
ఇక తాజాగా మణిశర్మనే దాదాపుగా ఫైనల్ చేశారని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఒక పాటకు సంబంధించిన ట్యూన్‌తో పాటు ఫైనల్ కంపోజింగ్ కూడా ఓకే అయిపోయిందని సమాచారం. అయితే ఈ మధ్య కాలంలో మణిశర్మ నుంచి బెస్ట్ అవుట్ రాలేదు. శాకుంతలం, ఆచార్య వంటి సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ కంపోజ్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు చాలా మంది ఈ రెండు సినిమాల్లో పాటలు కూడా గుర్తులేవు. అలాంటిది పూరి.. మణిశర్మ నుంచి ఎలాంటి అవుట్ పుట్ రాబట్టుకుంటాడో చూడాలి.