Main Atal Hoon | బాలీవుడ్ సీనియర్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై అటల్ హూ’(Main Atal Hoon). భారత మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమారాగా జనవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మార్చి 14వ తేదీ నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహించగా.. వినోద్ భానుశాలి, సందీప్ సంయుక్తంగా నిర్మించారు. పీయూష్ మిశ్రా, రాజా రమేశ్ కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.
Apne har roop mein woh safal hain, kyuki apne har nirnay par woh Atal hain!#MainAtalHoon premieres on 14th March, only on #ZEE5#AtalOnZEE5 pic.twitter.com/mEvRigQCEu
— ZEE5 (@ZEE5India) March 13, 2024