Mahesh Babu | సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో తన అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్లు, మాస్ స్ట్రైక్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ29కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్న ప్రిన్స్.. తాజాగా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న స్టిల్స్‌ను షేర్ చేశాడు. రోజు రోజుకీ వయస్సు తగ్గిపోయినట్టుగా కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచే మహేశ్ బాబు మరోసారి మేకోవర్‌ను సెట్ చేసుకునే బిజీగా మారిపోయారని తాజా స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. జిమ్‌లో మహేశ్‌బాబుతోపాటు పెట్ కూడా ఉండటం చూడొచ్చు.
గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Superstar @urstrulyMahesh and his companion hitting the gym together for a paw-some workout! 💪🤩🐾#MaheshBabu #GunturKaaram #SSMB28 #GunturKaaramOnJan12th pic.twitter.com/zAuAeLeHHT
— Mahesh Babu Space (@SSMBSpace) December 3, 2023
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..