SSMB28 Shoot Post Poned | టాలీవుడ్ మోస్ట్ అవేయ్టెడ్ కాంబోలలో మహేష్- తివిక్రమ్ హ్యట్రిక్ చిత్రం ఒకటి. ఈ కాంబోలో సనిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ తారలు కూడా ఎంతో ఎగ్జైయిటింగ్గా ఫీల్ అవుతారు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు క్లాసిక్స్‌గా మిగిలాయి. టీవీలో వచ్చిన ప్రతిసారి ఈ రెండు చిత్రాలు మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. ఇదిలా ఉంటే ఈ కాంబోలో మూడో సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటన వచ్చింది. ఇప్పటికే మహేష్ ఈ చిత్రం కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు. ఇటీవలే నమ్రత శిరోద్కర్ పోస్ట్ చేసిన మహేష్ బాబు లుక్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త వెనక్కు వెళ్ళిందని టాక్.
ముందుగా అనుకున్న డేట్‌కు షూటింగ్‌ను చిత్రబృందం ప్రారంభించలేకపోతున్నారట. దాంతో ఈ చిత్ర షూటింగ్ వారం రోజులు వాయిదా పడ్డట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.