తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన లెజండరీ స్టార్స్‌లో సూపర్ స్టార్ కృష్ణ తప్పక ఉంటారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటి వారికి ఆదర్శం.ఈ రోజు కృష్ణ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ తనయుడు ప్రిన్స్ మహేష్ మహేష్ బాబు తన ప్రేమతో కూడిన శుభాకాంక్షలు తెలియజేసారు. “జన్మదిన శుభాకాంక్షలు నాన్న. నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. మీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది” అని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రతి ఏడాది మహేష్ తన తండ్రి బర్త్‌డే సందర్భంగా ఆయన మూవీస్‌కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది కరోనా వలన ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. కాగా, మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ పెట్లతో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు.