Mahesh | టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మహేశ్ విట్టా తన అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. మహేశ్ భార్య శ్రావణి రెడ్డి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా శిశువు చేతిని తన చేతిలో పట్టుకున్న భావోద్వేగ భరితమైన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహేశ్ ..”డర్టీ డైపర్స్, ఇక నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి! అంటూ తన సంతోషాన్ని సరదాగా పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, సహా నటులు, అభిమానులు అందరూ మహేశ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మహేశ్ విట్టా గతేడాది 2023 సెప్టెంబర్‌లో , తన ప్రేయసి శ్రావణి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మహేశ్ చెల్లెలు అయిన శ్రావణి.. ఐదేళ్ల పాటు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో ప్రేమలో మునిగి తేలింది. ఇక పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ఇక కొద్ది నెలల క్రితం భార్య గర్భవతిగా ఉన్న విషయం ప్రకటించిన మహేశ్, గత నెల సీమంతం నిర్వహించిన ఫొటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు పండంటి మగబిడ్డతో వారి ప్రేమకు పునాది వేసినట్టైంది.
మహేశ్ విట్టా తన యూట్యూబ్ వీడియోలతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కృష్ణార్జున యుద్ధం , కొండపొలం , జాంబీరెడ్డి , ఏ1 ఎక్స్‌ప్రెస్ , ఇందు వదన వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్‌బాస్ 3వ సీజన్ మరియు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్లలోనూ తన యాక్టివ్ పార్టిసిపేషన్‌తో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న మహేశ్, త్వరలో ఒక సినిమాకు దర్శకుడిగా మారబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ విట్టా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తండ్రిగా మారడం ద్వారా బాధ్యతలు పెరిగినా, ఆనందం అంతకు మించి ఉందని చెప్పాలి.