సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలు మరొకరి దగ్గరకు వెళ్లడం కామన్. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు మహేష్ కోసం రాసుకున్న కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. రీసెంట్గా దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చింది. ప్యాన్ ఇండియా మూవీగా ‘స్పిరిట్’ తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ప్రభాస్ 25వ సినిమా కావటం విశేషం.
నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ వంగా.. మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని భావించారు. పవర్ ఫుల్ కథను మహేశ్ కోసం సిద్ధం చేసాడని, అతనికి వినిపించారని కూడా వార్తలు వచ్చాయి. మహేశ్ పుట్టిన రోజు ఫ్యాన్స్ నిర్వహించిన ట్విట్టర్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. అందులో మహేశ్ ని తప్పక డైరెక్ట్ చేస్తానని చెప్పాడు. తను చెప్పిన కథ మహేశ్ కి నచ్చలేదని, మరో కొత్త కథతో అప్రోచ్ అవుతానని అన్నాడు. అయితే ఇప్పుడు మహేష్‌కి నచ్చని కథతోనే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడా అని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతంం రణ్ బీర్ కపూర్‌తో యానిమల్ చేస్తుండగా, దాని తర్వాత స్పిరిట్ ఉండనుందట. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడట.