Globetrotter Event | దర్శకుడు రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ (Globetrotter Event) అనే పేరుతో ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుక మొదట ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. అయితే తాజాగా ఈ వేడుకకు సంబంధించిన మొత్తం వీడియోను చిత్రబృందం యూట్యూబ్ వేదికగా వదిలింది. గంట 37 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం డిజిటల్ వేదికగా వైరల్‌గా మారింది. కాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.