పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ టాప్ ఫాంలో ఉన్నారు. కంబ్యాక్ చాలా అద్భుతంగా ఉంది. ప్రకాశ్ రాజ్ కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని మహేష్ అన్నారు.
మరోవైపు నివేదా థామస్, అంజలి, అనన్య పాత్రలపై కూడా మహేష్ ప్రశంసలు కురిపించాడు. ముగ్గురు యువతలు అద్భుతంగా యాక్ట్ చేశారు. థమన్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజుతో పాటు ఇతర చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని మహేష్ పేర్కొన్నారు. వకీల్ సాబ్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 53 కోట్లకు పైగా వసూళ్లను సాధించాలి.
Heart-touching performances by the girls @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla! @MusicThaman score is top notch! 👍👍 Congratulations to the entire team! #SriramVenu @SVC_official @shrutihaasan #PSVinod @bayviewprojoffl @BoneyKapoor
— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2021