Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?

alia bhatt | మహేశ్ భట్.. బాలీవుడ్లో దిగ్గజ నిర్మాత, దర్శకుడు. అలాంటి బాడా ప్రొడ్యూసర్ వారసురాలిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఆలియా భట్. కానీ సెలెక్టివ్ సినిమాలను చేస్తూ తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్గా ఎదిగింది. కేవలం గ్లామర్ పాత్రలనే కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఒక బ్రాండ్ ఇమేజ్ను దక్కించుకుంది. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ఇక సంపాదన విషయంలో అయితే తండ్రినే మించిపోయిందంట. మహేశ్ భట్ 50 ఏండ్లు కష్టపడి సంపాదించిన సొమ్ము కూడా ఆలియా సంపాదన ముందు తక్కువేనంట. ఈ విషయాన్ని ఎవరో చెప్పట్లేదు. స్వయానా మహేశ్ భట్నే ఓ సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆలియా భట్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగుభాయ్ కతియావాడి, రాజమౌళి ట్రిపుల్ ఆర్ ( RRR ) సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానున్నాయి. వీటితో పాటు బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తుంది ఆలియా. స్టార్ కిడ్‌గా అడుగుపెట్టినప్పటికీ తన టాలెంట్‌తో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్న ఆలియా భట్‌ను చూసి ఆమె తండ్రి మహేశ్ భట్ మురిసిపోతున్నాడు.ఆ ఆనందాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘‘ సినిమా రంగంతో పాటు ఎక్కడైనా సరే రాణించాలంటే టాలెంట్ ఉండాలి. కొంతమంది తమ టాలెంట్‌తో చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ’’ అని మహేశ్ భట్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన కూతురు ఆలియా గురించి మాట్లాడుతూ.. తాను 50 ఏండ్లు కష్టపడి సంపాదించినంత డబ్బును ఆలియా కేవలం రెండేళ్లలోనే సంపాదించిందని మురిసిపోయాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Alia Bhatt : రోజూ ఉదయం లేవగానే ఆలియా భట్ చేసే పని ఇదే
Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
Alia Bhatt: వివాదంలో అలియా భట్ యాడ్..!
Rashmika Mandanna | రష్మిక తొలి హిందీ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

