MAhesh BABU| సూపర్ స్టార్ మహేష్ బాబుకి టాలీవుడ్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం మహేష్.. రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.అయితే తాజాగా మహేష్ మూవీ క్లైమాక్స్లకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమా కోసం రెండు క్లైమాక్స్‌లు షూట్ చేశారట. ఇప్పటి జనరేషన్ వాళ్లకి ఈ విషయం తెలియదు. మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ జంటగా శోభన్ దర్శకత్వంలో 2002లో బాబి సినిమా రూపొందింది.
ఈ సినిమా మహేష్ నటించిన తొలి లవ్ స్టోరీ మూవీ కాగా, ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ప్రకాష్ రాజ్, రఘువరన్, బ్రహ్మానందం, సునీల్, రవిబాబు ఇలా భారీ కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు.’టక్కరి దొంగ ‘ లాంటి కౌబాయ్ మూవీ తరువాత మహేష్ నుండి వచ్చిన ఈ మూవీపై అభిమానులు భారీ హోప్సే పెట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. అందుకు కారణం క్లైమాక్స్ లో మొత్తం అందరూ చనిపోతారు. హీరో మహేష్ బాబు, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోవడంతో సినిమా ఎండ్ అయిపోతోంది. అయితే ఇది మహేష్ ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేసింది. పెద్ద గొడవ చేశారు.
సెకండ్ షో సమయానికి డిజాస్టర్ అన్నారు. దాంతో ప్రొడక్షన్ టీం హడావుడిగా మరో చిన్న సీన్ షూట్ చేసి క్లైమాక్స్ మార్చేశారు. దాని ప్రకారం సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రి ప్రకాష్ రాజ్ వచ్చి పోలీస్ కాల్పుల్లో గాయపడిన మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లినట్టు చూపిస్తారు. ఇక చివరికి ఇద్దరికి పెళ్లి చేసి శుభం కార్డ్ వేస్తారు. అలా చేసిన కూడా సినిమా రిజల్ట్ మారలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు నెలల గ్యాప్‌లో ఒక్కడు చిత్రం రిలీజ్ అయి మహేష్ కెరియర్ని పూర్తిగా మార్చి వేసింది. ఫ్యాన్స్ కు ‘ఒక్కడు ‘ ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఆ సక్సెస్ తో “బాబీ ” గాయాన్ని మర్చిపోయారు ప్రిన్స్ అభిమానులు.